Balakrishna: బిగ్ బాస్ 9 సీజన్ హోస్ట్‌గా బాలయ్య..! 7 d ago

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9వ సీజనికి సిద్ధమవుతోంది. అయితే బిగ్ బాస్ మేకర్స్ నుంచి ఒక కొత్త వార్త వినిపిస్తోంది. 9వ సీజన్ మరింత ఉత్సాహంగా ఉండడానికి హోస్ట్ ను మార్చే ఆలోచనల్లో పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వచ్చే కొత్త సీజన్ కి టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య హోస్ట్ గా చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అదే విధంగా అటు రానా దగ్గుబాటి పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.